Tuesday, 5 September 2017

కన్నబిడ్డకు కన్యత్వ పరీక్షలు చేయించి... కసాయికి అమ్మేసిన తల్లి

02:30 0  
రకరకాల కారణాలతో కన్నబిడ్డలను అమ్మేసుకునే తల్లిదండ్రుల కథలు చాలానే విని ఉంటాం. అధిక సంతానమో, దుర్వ్యసనాల బారిన పడి డబ్బుల కోసమో పిల్లలను అమ్ముకోవడం దాదాపు అన్ని ప్రాంతాల్లో, దేశాల్లో జరుగుతూనే ఉంటుంది. కానీ కన్యత్వ పరీక్షలు జరిపి, తన బిడ్డ కన్య అని పరీక్షింపజేసి, వైద్యుని వద్ద నుండి సర్టిఫికేట్ తీసుకుని మరీ పిల్లలను అమ్ముకునే తల్లులూ ఇంకా ఉన్నారు. కాంబోడియాలోని మారుమూల గ్రామంలో జన్మించిన సెఫాక్ అనే అమ్మాయి వయస్సు కేవలం 13 సంవత్సరాలు. హాస్పిటల్కు తీసుకెళ్లి పరీక్షలు చేయించిన ఆమె తల్లి, తర్వాత సర్టిఫికేట్ అందుకుని, అటు నుండి అటే హోటల్ రూమ్లో విటులకు సెఫాక్ను అప్పగించి వెళ్లిపోయింది. మూడు రోజులపాటు నరకయాతన అనుభవించిన అనంతరం జీవచ్ఛవంలా ఇంటికి తిరిగొచ్చింది సెఫాక్

 పిల్లలతో సెక్స్ చేయడానికి ఎంత డబ్బులైనా కుమ్మరించడం అక్కడి విటులకు సరదా. సుమారు 6 వేల డాలర్ల అప్పుల ఊబిలో కూరుకుపోయిన సెఫాక్ తల్లి మరో గత్యంతరం లేక పనికి పూనుకున్నా, తర్వాత కూడా అమ్మాయిని వ్యభిచారం చేయమని ఒత్తిడి తేవడంతో సెఫాక్ అనేక సంవత్సరాలపాటు నరకకూపంలోనే ఉండిపోయింది

 ఇటీవలే స్వచ్ఛంద సంస్థ సహకారంతో అక్కడి నుండి బయటపడిన సెఫాక్ ఉద్యోగం చేస్తూ కాలం గడుపుతోంది. ఒకప్పుడు కాంబోడియాలోని స్వే పాక్ అనే ఊళ్లో ఆడబిడ్డ పుడితే నూటికి నూరు శాతం వ్యభిచార గృహాలకు అమ్మేసేవారని, ఇప్పుడు అది 50 శాతానికి తగ్గిందని స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు అంటున్నారు.
Read more...

అస్లీల వీడియోలపై సుప్రీం కోర్టు కొత్త తీర్ప

02:19 0
 లైంగిక దాడులు, సామూహిక అత్యాచారాలు, చైల్డ్పోర్నోగ్రఫీకి సంబంధించిన అభ్యంతరకర వీడియోలు, ఫోటోల అప్లోడింగ్పై వచ్చిన ఫిర్యాదుల వివరాలు ఇవ్వాలని ఫేస్బుక్‌, గూగుల్‌, వాట్సాప్‌, యాహూలను సుప్రీం కోర్ట్ఆదేశించింది. ఫిర్యాదులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో వెల్లడించాలని కోరింది. తరహా నేరాలపై పోక్సో చట్టం కింద ఎన్ని కేసులు నమోదు చేశారో తెలపాలని జస్టిస్మదన్బీ లోకూర్‌, యూయూ లలిత్తో కూడిన బెంచ్హోంమంత్రిత్వ శాఖను ఆదేశించింది.


 అభ్యంతరకర వీడియోలు, కంటెంట్పై  ఏడాది ఆగస్ట్‌ 31 వరకూ భారత్లో వచ్చిన ఫిర్యాదులు వాటిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారనే వివరాలను తెలుపుతూ అఫిడవిట్లు దాఖలు చేయాలని ఆయా కంపెనీలను ఆదేశిస్తున్నట్టు సుప్రీం బెంచ్పేర్కొంది. అప్పటి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి హెచ్ఎల్దత్తుకు హైదరాబాద్కు చెందిన ఎన్జీఓ ప్రజ్వల పంపిన లేఖపై కోర్టు విచారణ చేపట్టింది. ప్రజ్వల సంస్థ లేఖతో పాటు  లైంగికదాడులకు సంబంధించిన రెండు వీడియోలనూ పెన్డ్రైవ్లో పంపింది.

 లేఖను సుమోటోగా స్వీకరించిన కోర్టు వాట్సాప్లో పోస్ట్చేసిన వీడియోలపై తీవ్రంగా స్పందించింది. దీనిపై విచారణ చేపట్టి దోషులను పట్టుకోవాలని సీబీఐని కోరింది. ఇక సోమవారం జరిగిన విచారణ సందర్భఃగా అభ్యంతరకర దృశ్యాలను సోషల్మీడియాలో బ్లాక్చేసేలా చర్యలు చేపట్టడంపై ఇంటర్నెట్కంపెనీల ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులతో కూడిన కమిటీ చేస్తున్న ప్రయత్నాలను కంపెనీల ప్రతినిధులు కోర్టుకు వివరించారు.
Read more...

Follow Us @soratemplates